Christian Groups : పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తు కోసం రోడ్డెక్కిన క్రైస్తవ సంఘాలు

సంచలనం రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో క్రైస్తవ సంఘాలు రోడ్డెక్కాయి. ఈ క్రమంలోనే నగరంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. పాస్టర్ ప్రవీణ్ మృతి యావత్తు దేశాన్ని కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి వెనుక రహస్యాలు వెలుగులో కి తేవాలి అన్నారు. అంతవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు . ఆయన మృతి పై ఉన్న అనుమానాలను క్లారిఫై చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ భానుగుడి నుంచి కొండయ్యపాలెం మీదుగా కలెక్టరేట్ కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ఏపీకి... ఏపీ నుంచి హైదరాబాద్ కు ఎప్పుడెప్పుడు వచ్చారు, ఆయనతో ఆ పాటు … ఇంకా ఎవరైనా వచ్చేవారా అని లోతుగా ఆరా తీస్తున్నారు. గతంలో పాస్టర్ వాహనం ఎక్కడైనా ప్రమాదానికి గురైందా అన్న కోణంలో వాహనం హిస్టరీని వెలికితీస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ వాడుతున్న వాహనం జెస్సికా పగడాల పేరుపై ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లోనే ప్రవీణ్ నడుపుతున్న వాహనంపై ఎక్కువగానే చలాన్లు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com