Visakhapatnam Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి

Visakhapatnam Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి
X
Visakhapatnam Road Accident: విశాఖలోని ఎండాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Visakhapatnam Road Accident: విశాఖలోని ఎండాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో త్రీటౌన్‌ సీఐ కరణం ఈశ్వరరావు మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నైట్‌ రౌండ్స్‌ ముగించుకొని తెల్లవారుజామున మధురవాడ వైపు వెళ్తుండగా సీఐ వాహనం ప్రమాదానికి గురైంది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

స్పాట్‌లోనే ఈశ్వరరావు మృతి చెందారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జయింది. డ్రైవర్‌కి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ కుటుంబ సభ్యులను సీపీ సిన్హా పరామర్శించి ఓదార్చారు.


Tags

Next Story