16 March 2021 2:49 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీలో ఇరువర్గాల...

ఏపీలో ఇరువర్గాల ఘర్షణ.. ఒకరి మృతి.. కుల పెద్ద ఇంటిపై దాడి

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయంలో కుల పెద్దలు పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలోవ్యక్తిపై మరో వర్గం దాడి చేసింది.

ఏపీలో ఇరువర్గాల ఘర్షణ.. ఒకరి మృతి.. కుల పెద్ద ఇంటిపై దాడి
X

కృష్ణా జిల్లా నందిగామలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయంలో కుల పెద్దలు పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలో రామయ్య అనే వ్యక్తిపై మరో వర్గం మొద్దుతో దాడి చేసింది. దీంతో ఆయన స్పాట్‌లోనే చనిపోయాడు. ఆగ్రహించిన అనుచరులు పంచాయితీ పెట్టిన కుల పెద్ద ఇంటిపై దాడికి దిగారు. ద్విచక్రవాహనం తగులబెట్టారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు కారణమైన ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.


Next Story