CM Chandrababu : అనాథ బాలికకు రూ.10లక్షల సాయం: సీఎం చంద్రబాబు
నంద్యాల జిల్లా చిన్నవంగలిలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గురుశేఖర్, అతని భార్య, ఇద్దరు కూతుళ్లు మృతిచెందగా, మరో కూతురు ప్రసన్న(15) అనాథగా మిగిలింది. ఆమెకు రూ.10లక్షల సాయం ప్రకటించిన సీఎం, ఆమెను సంరక్షిస్తున్న నానమ్మకు రూ.2లక్షలు అందిస్తామన్నారు. బాలిక సంరక్షణ, విద్య విషయంలో అండగా ఉంటామన్నారు. ఈ ఘటనలో భార్యాభర్తలు గురుశేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ, వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి చనిపోయారు . వీరి మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో చదువుకుంటోంది. ఒకు కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. వీరంతా రాత్రి నిద్రిస్తుండగా అర్థరాత్రి మట్టి మిద్దె కూలి చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీశారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com