CM Chandrababu : రుషికొండ భవనాలపై ఏం చేద్దాం?.. మంత్రులతో సీఎం చర్చ

జగన్ హయాంలో విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలను ఏం చేయాలన్న అంశంపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మొదట మినిస్టర్లంతా ఆ బిల్డింగులను సందర్శించి అభిప్రాయాలు చెప్పాలని ఆయన సూచించారు. ఈ భవనాలను నిర్మించి జగన్ ప్రజాధనం వృథా చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అవి నిబంధనల మేరకు నిర్మించిన ప్రభుత్వ అతిథి గృహాలని వైసీపీ స్పష్టం చేస్తోంది.
నెలలో 4 రోజుల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్యాబినేట్ భేటీ అనంతరం సీఎం మంత్రులతో సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, చేసిన మంచిని చెప్పుకోవాలని సూచించారు. ఏపీ పథకాల్లో నాలుగో వంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో అమలు చేయట్లేదన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది.
* ప్రత్యేక వాహక ప్రాజెక్టుగా పోలవరం-బనకచర్ల
* ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి డ్రోన్ కార్పొరేషన్‌ను విడదీసి స్వతంత్ర సంస్థ ఏర్పాటు
* అనకాపల్లి డీఎల్‌పురంలో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ కంపెనీకి షరతులపై క్యాపిటల్ పోర్టు అప్పగింత
* త్రీస్టార్, ఆ పైబడిన హోటళ్ల బార్ లైసెన్స్ ఫీజులు రూ.25 లక్షలకు తగ్గింపు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com