CM Chandrababu : ప్రతి బుధవారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం: సీఎం చంద్రబాబు

ప్రతి బుధవారం నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్‌లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కృషి చేయాలని తెలిపారు. అదే రోజు గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు తీసుకోవాలన్నారు. ఇంఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలో నెలకు 2 రోజులు తప్పనిసరిగా పర్యటించాలని సీఎం అన్నారు.
‘కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలే టీడీపీ బలం. దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెదేపాకు ఉంది. కోటి సభ్యత్వాలతో చరిత్ర స్పష్టించి అతిపెద్ద కుటుంబంగా మారిన నేపథ్యంలో కార్తకర్తే అధినేత అని లోకేశ్ పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచినవారు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జులు, బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ, శంఖారావం ఫీల్డ్ వర్కులు, ఓటర్ వెరిఫికేషన్, పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేయిస్తున్న కార్యకర్తలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు’ అని పార్టీ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com