AP CM : సింగపూర్‌లో రెండో రోజు చంద్రబాబు బిజీ బిజీ

ఏపీసీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ కొనసాగుతోంది. ఏపీకి పెట్టబడులు తేవడమే లక్ష్యంగా ఆయన పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు పలువురు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులతో సీఎం టీమ్ భేటీ కానుంది. ఇవాళ ఉదయం 7గంటలకు ట్రెజరీ బిల్డింగ్‌లో సింగపూర్ పరిశ్రమల శాఖ మంత్రి డా. టాన్‌సీలెంగ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. విద్యుత్తు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చించారు. ఆ తర్వాత ఎయిర్‌బస్ సంస్థ ప్రతినిధులు కృతీవాస్, వెంకట్ కట్కూరితో సమావేశమయ్యారు. హనీవెల్ సంస్థ ప్రతినిధులతోనూ సీఎం సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.
రెండో రోజు షెడ్యూల్
11 గంటలకు - ఎవర్వోల్ట్ ఛైర్మన్ మిస్టర్ సైమన్ టాన్‌తో భేటీ
11.30కి - సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ సందర్శన.
1.00: టువాస్ పోర్టు సైట్‌లో పర్యటన.. పోర్టు సీఈవో విన్సెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చ
4.30: ఆంధ్రప్రదేశ్- సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.
6.00: అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీతో సమావేశం
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com