CM Chandrababu Naidu : నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నాగులుప్పలపాడు మండలంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆరు రోజులపాటు ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారు. 2.30 గంటలకు నాగులుప్పలపాడు మండలం, చదలవాడ చేరుకుంటారు. మద్దిరాలపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తారు. అనంతరం గ్రామ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు తిరిగి ఉండవల్లి బయలుదేరి వెళతారు. కాగా సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com