CM Jagan : ప్రధానితో సీఎం జగన్ భేటీ

CM Jagan : ప్రధానితో సీఎం జగన్ భేటీ
X

పార్లమెంట్ (Parliament) ఎన్నికలకు ముందు ఏపీ (AP) రాజకీయాల్లో వేడి మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (PM Modi) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం పార్లమెంట్ లో ప్రధాని మోదీని సీఎం జగన్ కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి రావాల్సిన పెండింగ్‌ నిధులు, విభజన సమయంలో పెండింగ్‌ అంశాలను పరిష్కరించాలని ఆయన మోదీని కోరినట్లు తెలుస్తోంది.

దాంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఏపీకి ప్రత్యేక హోదాపై కూడా సీఎం జగన్, ప్రధాని మోదీతో చర్చించనట్లు సమాచారం. ప్రధాని మోదీతో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిమంత్రి నిర్మలా సీతారామన్‌తో (Nirmala Sitaraman) సీఎం భేటీ కానున్నారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సార్లు మోదీతోనూ, కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఈ భేటీల్లో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా, ఏపీకి ఆర్థిక సహాయంపై విజ్ఞాపనలు అందిస్తూ వస్తున్నారు.

వీటన్నింటిపై కేంద్రం నుంచి ఆశించినంత సహకారం రాకపోయినా.. వైసీపీ సహకారం పార్లమెంట్ లోపల బయట బీజేపీకి కొనసాగుతూనే ఉంది. మరికొద్ది కాలంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ, జగన్ మధ్య ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చ జరిగిందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఏపీలో టీడీపీ – జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయని ప్రచారం సాగుతోంది.

Tags

Next Story