Balakrishna : ఆరు నెలల్లో టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తాం : బాలకృష్ణ

Balakrishna : ఆరు నెలల్లో టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తాం : బాలకృష్ణ
X

అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను ఆరు నెలల్లో పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. అసంపూర్తిగా నిలిచిపోయిన టిడ్కో గృహాలను ఎంపీ పార్థసారథితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

"గత ప్రభుత్వం పాలనలో అవినీతి అంతులేకుండా సాగిందని, తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. పాలనా అనుభవం లేని వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించడం, ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం ఇలా దోచుకోవడమే లక్ష్యంగా అయిదేళ్లు కొనసాగింది. హిందూపురం అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడాను. యువతకు ఉపాధినిచ్చే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం" అని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

కోటిపి సమీపంలో 5.73 కోట్లతో నిర్మించే విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు ఎమ్మెల్యే బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 10 గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు.

Tags

Next Story