CM Chandrababu : మా వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చింది: సీఎం చంద్రబాబు

ఉమ్మడి ఏపీలో విపక్షాలు తనను ప్రపంచ బ్యాంక్ జీతగాడు అని విమర్శించాయని, కానీ ప్రజల కోసం భరించానని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘నేను 1995లో తొలిసారి సీఎం అయినప్పుడు రోజుకు 10-15 గంటలే కరెంటు ఉండేది. దేశంలో తొలిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం. 2003లో కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాం. మేము తెచ్చిన సంస్కరణల వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇవ్వగలిగింది’ అని అసెంబ్లీలో సీఎం చెప్పారు. ఎన్టీపీఎస్ లాంటి ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను 83 శాతం పీఎల్ఎఫ్‌తో నడిపించామన్నారు. చాలా ప్రైవేటు సంస్థలకూ అది సాధ్యం కాదని.. ఈ పరిపాలనా మార్పులు ప్రజలు గుర్తించాలన్నదే తమ అభిప్రాయమన్నారు. గత 30 ఏళ్ల పాలనా సమయాన్ని బేరీజు వేసుకుంటే వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని లోటు పరిస్థితికి తీసుకెళ్లింది వైసీపీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పరిశ్రమలు కరెంటు వాడితే సర్చార్జి విధించిన పరిస్థితి గత ప్రభుత్వానిదన్నారు. 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత రాష్ట్ర విభజన సమయంలో ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com