Andhra Pradesh : ఏపీలో కానిస్టేబుల్ ఫలితాలు వాయిదా..రిలీజ్ ఎప్పుడంటే..?

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులు ఎదురు చూస్తున్న ఫలితాల విడుదల వాయిదా పడింది. గత మూడు సంవత్సరాల క్రితం పరీక్ష జరిగినప్పటికీ వివిధ కారణాల వల్ల ఫలితాల విడుదల ఆలస్యం అవుతూ వస్తుంది. చివరకు ప్రభుత్వం చొరవతో ఈరోజు ఫలితాలను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. ఐతే చివరి నిముషంలో ఈరోజు కూడా వాయిదా పడింది. రేపు ఉదయం ఫలితాల విడుదల ఉంటుందని అధికారులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలను ఈరోజు ఉదయం హోమ్ మంత్రి అనిత విడుదల చేస్తారని ప్రభుత్వం ప్రకటిందించింది. ఐతే తుది జాబితాను మరోసారి పరిశీలించాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ నిర్ణయించడం తో ఈ కార్యక్రమం ఆగిపోయింది. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా...మరింత పారదర్శకంగా ఫలితాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఇంకొక రోజు వాయిదా వేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. కాగా జూలై 30 బుధవారం ఫలితాలు విడుదల కానున్నాయి.
ఏపీ వ్యాప్తంగా 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2022 అక్టోబర్ లో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించింది అప్పటి ప్రభుత్వం.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకోగా.. 4,58,219 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. గత మూడు సంవత్సరాల గా అభ్యర్థులు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com