Nellore : నెల్లూరు వైసీపీలో మరింత ముదిరిన ఫ్లెక్సీ చిచ్చు..!

Nellore : నెల్లూరు వైసీపీలో ఫ్లెక్సీ చిచ్చు మరింత ముదురుతోంది. మంత్రి కాకాని, సీనియర్ నేత ఆనం ఫ్లెక్సీలను ఇలా ఏర్పాటు చేసిన వెంటనే అలా తొలగిస్తుండడం పట్ల వారి వర్గీయులు రగిలిపోతున్నారు. మాజీ మంత్రి అనిల్ వల్లే ఇదంతా జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు.
మంత్రిగా జిల్లాకు తొలిసారి వస్తున్న కాకానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాశారు. ఇక ఇవాళ ఆనం వర్గీయులు ఏర్పాటు చేసిన వాటినీ తీసేశారు. కానీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని అలాగే ఎందుకు ఉంచారని కాకాణి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.
మున్సిపల్ అధికారులకు ఈ ఫ్లెక్సీలు ఎందుకు కనిపించడం లేదు అనేది వాళ్ల ప్రశ్న. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాని, మాజీ మంత్రి అనిల్ మధ్య ఉప్పు నిప్పులా విభేదాలు ఉన్న నేపథ్యంలో.. బాహాటంగా విమర్శలు వద్దని అధిష్టానం ఆదేశించింది. ఐతే.. రెండు వర్గాల మద్య ఇండైరెక్ట్‌గా ఫ్లెక్సీల రూపంలో వార్ కంటిన్యూ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com