ఏపీలో వినాయకచవితి ఉత్సవాలపై ఆంక్షలతో వివాదం..!

ఏపీలో వినాయక చవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.. మంటపాల ఏర్పాటుకు, నిమజ్జనాలకు అనుమతి నిరాకరించడంపై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు ఉందన్న కారణంగానే ఉత్సవాలపై ఆంక్షలు విధించామని ప్రభుత్వం చెప్తున్నా వారు శాంతించడం లేదు. ఇంట్లో, ఆలయాల్లో తప్ప ఎక్కడా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేయడం దారుణమని విమర్శిస్తున్నారు.
ఇంట్లోనే చవితి చేసుకోవాలని చెప్పడానికి.. ముఖ్యమంత్రి ఎవరు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. చవితి చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి కావాలా అంటూ BJP అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. హిందువుల పండుగపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని నిలదీశారు. ఇతర మతాల పండుగలంటే ఒకలా.. హిందువుల పండగలు అంటే మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఇది సరికాదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
హిందువులపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు.. రాష్ట్రంలో వినాయక మండపాలకు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.. హిందూ సనాతన సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందంటూ ఫైరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com