ఏపీలో కొత్తగా 7,553 కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి నెమ్మదిగా తగ్గుతుంది. పదివేలకు పైగా నమోదైన కేసులు ఇటీవల ఎనిమిది వేలకు దిగువకు వస్తున్నాయి.

ఏపీలో కరోనా వ్యాప్తి నెమ్మదిగా తగ్గుతుంది. పదివేలకు పైగా నమోదైన కేసులు ఇటీవల ఎనిమిది వేలకు దిగువకు వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,553 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6,39,302కి చేరిందని తెలిపింది. మొత్తం కేసుల్లో 5,62,376 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 71,465 చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కరోనా కాటుకి 51 మంది బలి కాగా మొత్తం ఇప్పటివరకూ 5,461 మృతి చెందారు. కాగా.. ఏపీలో కరోనా రికవరీ రేటు గణనీయంగా నమోదవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story