తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న కరోనా వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా పంపిణీ చేపట్టారు. దీనిలో భాగంగా పూణెలోని సిరం ఇన్‌స్టిట్యూట్ నుంచి వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్ ను తరలిస్తున్నారు. ఈనెల 16వ తేదీన వ్యాక్సినేషన్ వేయనున్న నేపథ్యంలో దేశంలోని అన్నిరాష్ట్రాలకు పంపించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక విమానాల్లో ఆయా రాష్ట్రాలకు పంపించారు. దీనిలో భాగంగా కరోనా వ్యాక్సిన్ తెలుగు రాష్ట్రాలకు సైతం చేరుకుంది. స్పైస్ జెట్ కార్గో SG 7466 విమానంలో వ్యాక్సిన్ లోడ్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కోఠి ఆసుపత్రి లోని కోల్డ్ స్టోరోజ్ తరలించారు. అక్కడి నుంచి జిల్లాలకు వ్యాక్సిన్ తరలించనున్నారు. ఇప్పటికే జిల్లాలకు వ్యాక్సిన్ వేసే సిరంజీలు చేరుకున్నాయి.
తెలంగాణకు 31 బాక్సుల్లో 3 లక్షల 72 వేల డోసుల వ్యాక్సిన్‌లు వచ్చాయి. దీని కోసం వ్యాక్సిన్ నిల్వ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 44 క్యూబిక్ మీటర్ సామర్థ్యం కలిగిన ప్రత్యేక ఫ్రీజర్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. కోఠి నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. తొలి విడతగా 2 లక్షల 90వేల మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్‌ను అందజేయనున్నారు. తొలి రోజు 139 కేంద్రాల్లో 13వేల 9వందల మందికి కొవిడ్ టీకా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1వెయ్యి 213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేశారు.
తొలిదశ వ్యాక్సినేషన్‌లో భాగంగా కొవిషీల్డ్ టీకా డోసులు పుణె నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ప్రత్యేక బందోబస్తుతో గవర్నరంలోని రాష్ట్ర వ్యాధినిరోధక భవనానికి అధికారులు తరలించారు. తొలిదశలో భాగంగా 4 లక్షల 75 వేల మందికి కొవిషీల్డ్ టీకా అందించనున్నారు. మొదటి విడత ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గన్నవరం వ్యాక్సినేషన్ సెంటర్‌లో జిల్లాకు సరిపడా టీకాలను భద్రపరిచారు. అక్కడినుంచి 13 జిల్లాలకు వ్యాక్సిన్ తీసుకెళ్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com