"చార్జీల పేరుతో జగన్ సర్కార్ కొత్త రకం బాదుడు"

చార్జీల పేరుతో జగన్ సర్కార్ కొత్త రకం బాదుడు
విద్యుత్ బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం దొంగ దెబ్బ తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


సర్దుబాటు చార్జీల పేరుతో జగన్ సర్కార్ కొత్త రకం బాదుడు మొదలుపెట్టిందని ఆరోపించారు సీపీఎం నాయకులు సిహెచ్ బాబురావు. విజయవాడలో విద్యుత్ దోపిడీకి వ్యతిరేకంగా సీపీఎం నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. విద్యుత్ భారాలు సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో మరో ప్రమాదం పొంచి ఉందన్నారు. విద్యుత్ రంగాన్ని అదానితోపాటు ఇతర కార్పొరేట్లకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయన్నారు.


మరో విద్యుత్ పోరుకు సిద్ధం కావాలని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు సిహెచ్ బాబురావు. మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యుత్ బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం దొంగ దెబ్బ తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడు ఇంత బిల్లులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల ప్రమాదాలను ప్రజలకు వివరించగా ప్రతిఘటించడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు. విద్యుత్ బిల్లులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు కే.శ్రీదేవి, బి.రమణారావు, కే.దుర్గారావు, సిహెచ్.శ్రీనివాస్, జాన్సి, పీరు, సాహెబ్, సుజాత, బొంగు రాంబాబు, అమ్ములు, ఓంకార్, అప్పన్న, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story