Vijayawada : పున్నమి ఘాట్‌లో సైకిల్, డ్రోన్ షో.. ఆశ్చర్యచకితుడైన చంద్రబాబు

Vijayawada : పున్నమి ఘాట్‌లో సైకిల్, డ్రోన్ షో.. ఆశ్చర్యచకితుడైన చంద్రబాబు
X

ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడలో జరిగిన డ్రోన్ షో అదుర్స్‌ అనిపించింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ డ్రోన్‌ షో సాగింది. డ్రోన్ సమ్మిట్ లో భాగంగా విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన ఈ భారీ ఈవెంట్ లో డ్రోన్ విన్యాసాలు అచ్చెరువొందించాయి. ఇందులో 5 వేల 5 వందల డ్రోన్‌లు పాల్గొన్నాయి. అమరావతి వేదికగా తొలి అంతర్జాతీయస్థాయి ప్రదర్శన సాగింది. ఈ డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. తద్వారా విజయవాడ డ్రోన్ షో చరిత్ర సృష్టించింది. డ్రోన్లను ఉపయోగించి అతి పెద్ద భూగోళం ఆకృతి, అతి పెద్ద ల్యాండ్ మార్క్, అతి పెద్ద విమానం, అతి పెద్ద జాతీయ జెండా, ఏరియల్ లోగో రూపొందించారు. ఇలా విజయవాడ డ్రోన్ షో ఐదు అంశాల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. కాగా వీటికి సంబంధించిన గిన్నిస్ బుక్ వరల్డ్‌ రికార్డ్స్‌ ను ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు సర్టిఫికెట్లు అందజేశారు.

Tags

Next Story