AP PRC: ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఏపీ సర్కార్.. ఇంకా..

YS Jagan (tv5news.in)
AP PRC: ఉద్యోగులు అడిగింది కొండంత.. ప్రభుత్వం ఇచ్చింది మాత్రం గోరంత.. ఏపీలో ఉద్యోగ సంఘాలను జగన్ సర్కార్ తీవ్ర నిరాశకు గురిచేసింది.. 50 నుంచి 60 శాతం వరకు ఫిట్మెంట్‌పై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు 23 శాతంతో సరిపెట్టింది.. ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు జరిపిన సమావేశంలో ఫిట్‌మెంట్‌కు సంబంధించి తుది నిర్ణయం వెలువడింది..
ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. జనవరి ఒకటి నుంచి పెంచిన కొత్త జీతాలు అమలు చేయనున్నారు. వేతనాల పెంపుతో ఖనాజాపై 10వేలా 247 కోట్ల భారం పడుతుందని చెప్పారు.. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిందన్నారు సీఎం జగన్.. ఉద్యోగులకు మంచి చేయడానికే ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచిస్తుందని చెప్పారు..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు.. ఉద్యోగుల అనుభవాన్ని రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిగా భావిస్తామని, అందుకే రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ చెప్పారు. బకాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి అంశాలన్నీ ఏప్రిల్ నాటికి క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.. పెండింగ్‌లో వున్న అన్ని డీఏలను జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశించారు.. ఇక కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి జీతాల నుంచే కొత్త స్కేల్స్ అమలవుతాయన్నారు సీఎం జగన్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ 30లోగా ప్రొబేషన్ కన్ఫర్మేషన్ చేస్తామన్నారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com