AP : అసత్య ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా: విజయసాయిరెడ్డి

తన వ్యక్తిత్వంపై కుట్రపూరితంగానే అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy ) మండిపడ్డారు. ‘ఓ ఆదివాసీ మహిళను బజారుకీడ్చారు. ఎంపీనైన నన్ను ఎంతోమంది కలుస్తారు. అంతమాత్రాన సంబంధం అంటగడతారా? తారతమ్యాలు లేవా? సాయిరెడ్డి తండ్రిలాంటి వ్యక్తి అని ఆమెనే చెప్పింది. ఆరోపణలు చేసినవారిపై కేసులు పెడతా. త్వరలోనే ఛానల్ ప్రారంభించి వారి కుట్రలను ఎండగడతా’ అని తెలిపారు. తనకు అక్రమ సంబంధం అంటగట్టి అసత్య ప్రచారం చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రామోజీరావునే ఎదుర్కొన్నానని, ఇప్పుడు ఈ కుట్ర వెనుక ఉన్నవాళ్లకూ బుద్ధి చెబుతానని హెచ్చరించారు. పరువు నష్టం దావా వేయడంతోపాటు పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని తెలిపారు. ఓ వర్గం మీడియా దుష్ప్రచారాలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతానని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com