Annamayya District : రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రమాదేవి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ రమాదేవి ప్రయాణిస్తున్న కారు నుజ్జు నుజ్జు కావడంతో ఆమె కారులో ఇరుక్కున్నారు. అక్కడున్న స్థానికులు పరుపరుగున వచ్చి రమాదేవిని వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా రమాదేవి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com