NAVARAATRI: గాయత్రి దేవిగా అమ్మవారి దర్శనం

దసరా నవరాత్రులలో రెండో రోజు దుర్గమ్మ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. నవరాత్రుల్లో అమ్మవారికి రోజుకొక రకమైన పూలను సమర్పించడం వల్ల భక్తుల కోరికలన్నీ దుర్గాదేవి తీరుస్తుందని నమ్మకం. రెండో రోజు అమ్మవారి బ్రహ్మచారిణి స్వరూపానికి అంకితం చేస్తారు. కమలం, మల్లెలు మొదలైన తెల్లని రంగుల పువ్వులంటే వీరికి చాలా ఇష్టం. నవరాత్రి రెండో రోజు మీరు బ్రహ్మచారిణి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి తామర లేదా మల్లెపూలను సమర్పించవచ్చు.
బ్రహ్మచారిని అలంకారంలో అమ్మవారు
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం అశ్వీయుజ శుద్ధ విదియ నేపథ్యంలో బ్రహ్మచారిని అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెమలి వాహనంపై పట్టణ పురవీధుల గుండా విహరించి భక్తులకు అమ్మవారు దర్శనమివ్వన్నారు.
నవరాత్రి రెండో రోజు విశేష పూజలు
దసరా మహోత్సవాలలో భాగంగా శ్రీశైలంలో రెండవ రోజు అమ్మవారికి బ్రహ్మచారిణి అలంకారణ చేసి.. స్వామి అమ్మవార్లు మయూర వాహనం గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అమ్మవారికి శ్రీ చక్ర అర్చన. నవావరణార్చన విశేష కుంకుమార్చనలు రుద్ర హోమం చండీ హోమం నిర్వహిస్తారు. చతుర్వేదపారాయణలు రుద్ర పారాయణం చండీపారాయణ, జపానుష్ఠానాలను ఆలయ వేద పండితులు నిర్వహిస్తారు.
శ్రీగాయత్రి దేవిగా అమ్మవారి దర్శనం
శరన్నవరాత్రుల్లో అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో పండితులు మాట్లాడుతూ.. ‘గాయత్రీ దేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. కాగా రెండో రోజు అమ్మవారిని నారింజ రంగు వస్త్రంతో అలంకరించి కనకాంబరాలతో అమ్మను పూజించాలి అని శాస్త్రం చెబుతోంది. అలానే గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం నివేదించాలి.’ అని తెలిపారు.
ప్రత్యేక బస్సులు
నంద్యాల జిల్లాలో దసరా పండగ సందర్భంగా ఆర్టీసీ వారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా 79 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుచున్నట్లు నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారి రజియసుల్తాన శుక్రవారం తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు విజయవాడ, బెంగుళూరు మరియు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుండి అనగా బిహెచ్చఈఎల్, మియాపూర్, కేపిహెచ్చబి, ఎంజీబీఎస్ నుండి నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు 8వ తేదీ నుండి 11 వరకు నడపనున్నారు.
ఈ పూలు సమర్పిస్తే..
నవరాత్రుల్లో అమ్మవారికి రోజుకొక రకమైన పూలను సమర్పించడం వల్ల భక్తుల కోరికలన్నీ దుర్గాదేవి తీరుస్తుందని నమ్మకం. రెండో రోజు అమ్మవారి బ్రహ్మచారిణి స్వరూపానికి అంకితం చేయబడింది. కమలం, మల్లెలు మొదలైన తెల్లని రంగుల పువ్వులంటే వీరికి చాలా ఇష్టం. నవరాత్రి రెండో రోజు మీరు బ్రహ్మచారిణి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి తామర లేదా మల్లెపూలను సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com