మాజీ మంత్రి దేవినేని ఉమను అరెస్టు చేసిన పోలీసులు

అధికార, విపక్షాల సవాళ్లు, ప్రతిసవాళ్లతో కృష్ణా జిల్లా గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ గొల్లపూడిలో NTR విగ్రహంవద్ద దీక్షకు సిద్ధమైన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేశారు.
ఆయన సెంటర్‌లోకి వస్తూనే అడ్డుకున్నారు. అక్కడి నుంచి బలవంతంగా వ్యాన్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎట్టిపరిస్థితుల్లో NTRకు నివాళులు అర్పించి దీక్ష చేస్తానంటూ దేవినేని ఉమ పట్టుబట్టడం, టీడీపీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి బలవంతంగా దేవినేని ఉమను పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
నిన్న గొల్లపూడిలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దేవినేని ఉమా. దమ్ముంటే టచ్ చేసి చూడు అంటూ సవాల్ విసిరారు. అటు, TDPకి పోటీగా YCP నేతలు కూడా NTR విగ్రహం వద్ద ధర్నాకు రావడంతో పొలిటికల్ కాక రెట్టింపయ్యింది. తాను మంత్రి కొడాలి నానీకి సవాల్ విసిరితే ఎమ్మెల్యేల్ని పంపడం బట్టే YCP సర్కార్‌కు దమ్ములేదనే విషయం అర్థమైందని దేవినేని ఉమ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com