కీలకమైన పోలవరంపై మంత్రి అనిల్ బాధ్యత లేకుండా మాట్లాడారు..: దేవినేని ఉమ

X
పోలవరం ఉనికి ప్రమాదంలో పడినా సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ నిలదీశారు. అత్యంత కీలకమైన అంశంపై మంత్రి అనిల్ బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. పోలవరం అంచనాలపై వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాల వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని.. CM ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలతో మాట్లాడాలని సూచించారు. ముంపు పరిహారం పెంపు విషయంలో కేంద్రం అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తేనే 55 వేల 548 కోట్లకు ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. పోలవరం నిర్మాణం విషయంలో TDPపై విమర్శలు మానుకోవాలని దేవినేని ఉమ హితవు పలికారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
