దేవినేని ఉమ ఇంటికి వెళ్లి బడిత పూజ చేస్తా : మంత్రి కొడాలి నాని

దేవినేని ఉమ ఇంటికి వెళ్లి బడిత పూజ చేస్తా : మంత్రి కొడాలి నాని
నాని చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు దేవినేని ఉమ.

దేవినేని ఉమ ఇంటికి వెళ్లి గొల్లపూడిలో బడిత పూజ చేస్తానని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో దుమారం రేపుతున్నాయి.

నాని చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు దేవినేని ఉమ. ఇవాళ ఉదయం 10గంటలకు గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానని దేవినేని ఉమ ప్రకటించారు. సీఎం వస్తారో మంత్రి కొడాలి నాని వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. గొల్లపూడిలో దీక్షకు కూర్చుంటా.. టచ్ చేసి చూడు అంటూ దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.

ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరసనగా దీక్షకు కూర్చుంటును అన్నారు దేవినేని. జగన్ వచ్చి టచ్ చేస్తారా లేక మంత్రిని పంపుతారో తేల్చుకునేందుకు సిద్ధమన్నారు.

బాబాయ్‌ని ఎవరు హత్య చేశారో జగన్‌ని నిలదీసే ధైర్యం మంత్రికి ఉందా? అని దేవినేని నిలదీశారు. ఉడత ఊపుళ్ళకు భయపడే జగన్.. అమిత్‌ షా కాళ్ళు పట్టుకునేందుకు దిల్లీ వెళ్తున్నారా? అని నిలదీశారు.

మంత్రి కొడాలి నాని తీరుకు వ్యతిరేకంగా తెలుగు మహిళలు ఆందోళన బాట పట్టారు. ఒంగోలులో టీడీపీ విగ్రహం దగ్గర నిరసన ర్యాలీ చేపట్టారు. వినూత్నంగా రోడ్డుపై పేకాట ఆడుతూ.. జూదం మంత్రి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఇటీవలో స్వయంగా మంత్రి ఇలాకాలో పేకటరాయుళ్లు పట్టుబడినా చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ టీడీపీ మహిళ నేతలు ప్రశ్నించారు.

మంత్రి కోడాలి వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతూనే ఉన్నాయి.. పదే పదే బూతులు మాట్లాడుతున్నారని.. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లడడం సరికాదని విమర్శిస్తున్నా.. ఆయన తీరు మారడం లేదు.. దీంతో హద్దులు దాటి మాట్లాడుతున్న మంత్రిని భర్తరప్‌ చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story