DGP Goutam Sawang: చంద్రబాబు ఫోన్‌కాల్‌ను ఎత్తలేదనే ఆరోపణలు సరికాదు: డీజీపీ గౌతమ్ సవాంగ్

DGP Goutam Sawang (tv5news.in)
DGP Goutam Sawang: రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని దూషించకూడదన్నారు డీజీపీ సవాంగ్. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై కాకుండా.. కేవలం పట్టాభి వాడిన భాషపైనే గౌతమ్ సవాంగ్ ఎక్కువగా కామెంట్ చేశారు. అలాంటి భాషను గతంలో ఎప్పుడూ వాడలేదని చెప్పుకొచ్చారు. అభ్యంతరకర పదాలను పదేపదే వాడారని, ఉద్దేశపూర్వకంగానే అలాంటి భాషను ఉపయోగించారన్నారు సవాంగ్. ఇక చంద్రబాబు డీజీపీకి చేసిన ఫోన్ కాల్ గురించి డీజీపీ క్లారిటీ ఇచ్చారు. నిన్న తెలియని నెంబర్ నుంచి వాట్సప్ కాల్ వచ్చిందని, పరేడ్ గ్రౌండ్‌లో ఉన్న కారణంగా ఎవరు మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించలేదన్నారు.
నిన్న జరిగినవి దురదృష్ట సంఘటనలు-డీజీపీ గౌతమ్ సవాంగ్
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని దూషించవద్దు-సవాంగ్
ఇలాంటి భాషను గతంలో ఎప్పుడూ వాడలేదు-సవాంగ్
అభ్యంతరకర పదాలను పదేపదే వాడారు-సవాంగ్
ఉద్దేశపూర్వకంగానే ఆ భాషను వాడారు-సవాంగ్
నిన్న నాకు వాట్సప్ కాల్ వచ్చింది-సవాంగ్
అప్పుడు నేను పరేడ్ గ్రౌండ్‌లో ఉన్నాను-సవాంగ్
ఎవరు మాట్లాడుతున్నది స్పష్టంగా లేదు-సవాంగ్
చంద్రబాబు ఫోన్‌కాల్‌ను ఎత్తలేదనే ఆరోపణలు సరికాదు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com