AP : పొలంబాట పట్టిన దివ్వెల మాధురి

AP : పొలంబాట పట్టిన దివ్వెల మాధురి
X

YCP నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అలాగే ఆయన వీరాభిమాని దివ్వెల మాధురి తనదైన శైలిలో నిరసన తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో రైతులకు అన్యాయం జరుగుతుందంటూ టెక్కలి నియోజకవర్గంలో పొలం బాట పట్టారు. వరి చేను కోత కోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం రైతాంగానికి తీరని అన్యాయం చేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 13వేల 500 రూపాయలు రైతు భరోసా వచ్చేదన్నారు. ఇప్పుడు కూటమి సర్కారు 20 వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిందన్నారు. 20వేలు అందాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభవ అంటూ సూపర్ సిక్స్ లో ప్రకటించిన హామీ ఏమైందని నిలదీశారు.

Tags

Next Story