ఆంధ్రప్రదేశ్

Guntur : టీడీపీ నేత హత్యకేసులో ఎనిమిది మంది అరెస్ట్‌

Guntur : ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీడీపీ నేత దారుణ హత్య కేసులో ఎనిమిది మంది నిందుతులను గుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Guntur : టీడీపీ నేత హత్యకేసులో ఎనిమిది మంది అరెస్ట్‌
X

Guntur : ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీడీపీ నేత దారుణ హత్య కేసులో ఎనిమిది మంది నిందుతులను గుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందుతుడు చింత శివరామయ్యతో పాటు ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసినట్లు గుంటూరు ఎస్పీ విశాల్‌ గున్ని వెల్లడించారు. మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడులో జరిగిన హత్య ఘటనలో పోలీసులు వేగంగా స్పందించారని, ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలను సేకరించడమే గాక నిందుతులను కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్ట్‌ చేశారని తెలిపారు. హతుడు తోట చంద్రయ్య, ప్రధాన నిందుతుడు శివరామయ్య మధ్య గత కొంతకాలంగా వ్యక్తిగత కక్షలు ఉన్నాయని, ఇవే హత్యకు దారితీసినట్లు చెప్పారు.

Next Story

RELATED STORIES