ELC Elections : వైసీపీ దొంగ ఓట్లను నమోదు చేస్తుంది : అచ్చెం నాయుడు

రాష్ట్రంలో ఎన్నికలు అంటే ఫాల్స్‌గా మారాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీలో అధికార దుర్వినియోగం జరుగుతుందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ దొంగ ఓట్లు నమోదు చేయించిందన్నారు. ఎన్ని కుట్రలు చేసిన టీడీపీ విజయం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు వైసీపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఇక పట్టాభిపై పోలీసుల చర్యలు దుర్మార్గమన్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ గాడి తప్పిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ అమలు విషయంలో జగన్‌కు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇక జగన్‌కు పబ్లిసిటీ పిచ్చి పెరిగిందని.. ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ లా పథకం పేరుతో కోటి రూపాయలు నిధులు విడుదల చేసిన జగన్.. వాటి ప్రకటనలో కోసం మరో కోటి రూపాయలు ఖర్చు చేయడం దుర్మార్గమన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలన్నారు. టీడీపీ అభ్యర్థులు గెలిస్తేను వైసీపీ అరాచకాలు తగ్గుతాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com