AP : వైసీపీ అప్పులు చేసినా.. మేం రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నాం: మంత్రి ఆనం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా చేజర్ల మండలంలోని కోటి తీర్థం తూర్పు కంభంపాడు గ్రామలలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. మొదట కోటి తీర్థం గ్రామంలో ప్రముఖ శైవ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఈ గ్రామాలలో మూడు కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
జల జీవన్ మిషన్ ద్వారా మంచి నీటి పథకాలకు శంకుస్థాపన, గ్రామలలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతి గదులు, పశువైద్యశాలను ప్రారంభించి గ్రామాల్లో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభోత్సవాలు నిర్వహించారు.. ఈ గ్రామాలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం లో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఏడాదిలోని తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని తమ ప్రభుత్వానికి అండగా ఉండాలంటూ ప్రజలను కోరారు.
అనంతరం తూర్పు ఖమ్మంపాడు గ్రామంలో జరిగిన సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమ సభలో మంత్రి ఆనం మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి పనిని చేపడుతున్నామని ప్రజల అవసరాలను తెలుసుకుంటూ వారి సమస్యలను తీరుస్తున్నామని అన్నారు.. ప్రతిపక్షంగా చెప్పుకునే వారికి ఇది కనబడడం లేదా అని ఎద్దేవా చేశారు..గత ప్రభుత్వం తమకు అధిక అప్పులు మిగిలించిందని వాటిని తీరుస్తూనే ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు..
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com