Kadapa : కడప జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు .. ఆదుకోండి మహాప్రభో అంటూ విలపిస్తున్న జనం..!

Kadapa : కడపలో వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కన్నవారిని, కట్టుకున్నావారి దూరం చేశాయి. బాధితులకు తిండి లేదు. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు. ఉన్న కాస్త కనీళ్లను దిగమింగి..... ఆదుకోండీ మహాప్రభో అంటూ...బోరున విలపిస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడు ఏడీ? ఆదుకోవాల్సిన అధికారులు, మంత్రులు పత్తా లేరు. అధికారంలో ఉన్నవారు కనీసం అటువైపే చూడటం లేదు. గాల్లో తిరుగుతూ... గాల్లోనే వెళ్లిపోతున్నారు. దీంతో బాధితుల కష్టాలు అంతా ఇంతా కాదు.
భారీ వర్షాలు, వరదలతో... పేదల ఇళ్లు పేక మేడల్లా కూలిపోయాయి. గతంలో ఎన్నూడు లేని విధంగా వరదలతో భారీ విధ్వంసం జరిగింది. రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇళ్లు.. వరదలకు కొట్టుకుపోవడంతో.. తలదాచుకునేందుకు నీడ కరువైంది. ఒకరు ఇద్దరు కాదు..పదుల సంఖ్యలో... ఇళ్లు లేక జనం అష్ట కష్టాలు పడుతున్నారు.
రాజంపేట మండలం బాదనగడ్డపై నిర్మించిన అన్నమయ్య జలయాశయం కట్ట... ఈ నెల 19న వచ్చిన వరదలతో తెగిపోయింది. పోటేత్తిన నీటి ఉద్ధృతితో చెయ్యేరు నది ఉగ్రరూపం దాల్చింది. బహుదా పరివాహకంలోని రాజంపేట మండలం పలపుత్తూరు, దిగివ, ఎగువ మందపల్లి. తొగురపేట, రామచంద్రపురం, కొనరాజుపల్లె, గుండ్లురు, చొప్పవారిపల్లెలో వరదలు బీభత్సం సృష్టించాయి.
నందలూరు మండలం ఇసుకపల్లి, పాటూరు, కుమ్మరిపల్లి, నీలిపల్లి తదిత గ్రామాల్లో పక్కా ఇళ్లన్ని కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లలోకి 10 అడుగులమేరకు నీరు చేరింది. కొన్ని ఇళ్లకు పునాధులు కూడా కనిపించడం లేదు. ఎగువమందపల్లి గ్రామంలో.. పూజారి రామ్మూర్తి కుటుంబంలో 9 మంది వరదలకు బలయ్యేరు. ఇక్కడ ఎవర్ని కదిలించినా... కన్నీరుమున్నీరవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com