Andhra Pradesh: ఏపీలోని ఆ ప్రాంతాల్లో థియేటర్లు సీజ్..

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో లైసెన్స్ లేకుండా నడుస్తున్న 15 థియేటర్ల మూసివేతకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్లలో టికెట్ రేట్లు, ఫైర్ సేఫ్టీ, కోవిడ్ ప్రోటోకాల్‌పై తనిఖీలు నిర్వహించారు. ప్రేక్షకుల భద్రత కోసం నిబంధనలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేశారు. టికెట్ రేట్ల కన్నా తినుబండారాల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇకపై మల్టీఫ్లెక్స్‌లతో పాటు అన్ని థియేటర్లకు ఫిక్స్‌డ్ రేట్లను ఫిక్స్ చేశారు. జీవో 35ను కోర్టులో కొట్టేయడంతో అంతకు ముందు రేట్ల అమలుపై అధికారులు దృష్టి సారించారు.
విజయనగరం జిల్లాలో నిబంధనలు పాటించని సినిమా థియేటర్లపై.. రెవెన్యూ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు థియేటర్లను సీజ్ చేశారు అధికారులు. 2015 నుంచి ఫైర్ సేఫ్టీ లైసెన్స్ రెన్యువల్ చేయలేదంటూ.. పూసపాటిరేగలోని సాయికృష్ణా థియేటర్‌పై చర్యలు తీసుకోగా.. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారంటూ భోగాపురం మండలం గోపాలకృష్ణ థియేటర్, నెల్లిమర్లలోని S3 థియేటర్, కొత్తవలసలోని లక్ష్మి, జయ, నరసింహ థియేటర్లను సీజ్ చేశారు. మరోవైపు ప్రభుత్వం కావాలనే దాడులు చేస్తూ ఇబ్బంది పెడుతోందని మూవీ డిస్టిబ్యూటర్లు మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com