Fire Accident : విశాఖ ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..

విశాఖ జగదాంబ కూడలి సమీపంలోని ఇండస్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులోని ఆపరేషన్ థియేటర్లో నైట్రస్ ఆక్సైడ్ పేలుడుతో అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో ఆసుపత్రిలోని అన్ని అంతస్తులను దట్టమైన పొగ వ్యాపించింది. దట్టమైన పొగ అలుముకోవడంతో రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. వృద్ధ రోగులు ఊపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. Spotఅగ్నిప్రమాదంతో వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది.... I.C.Uలో ఉన్న 52 మంది రోగులను చకచకా కిందికి తీసుకొచ్చారు. అక్కడినుంచి అంబులెన్సుల్లో ఇతర ఆస్పత్రులకు తరలించారు. రోగులను తరలించడంతో స్థానికులతోపాటు పోలీసులు కూడా ఆసుపత్రి సిబ్బందికి సహకరించారు. మూడో అంతస్తులో ఎవరైనా చిక్కుకుపోయారా అని నిశితంగా పరిశీలించారు. ఎక్కడా ఎవరూ లేరని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలు, పొగను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com