Omicron India: తెలుగు రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు..

X
Omicron India: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వచ్చినట్లు తెలిపింది.
గత నెల 27న ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన ఆ వ్యక్తికి విశాఖ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా కరోనాగా నిర్దారణ అయింది. హైదరాబాద్ సీసీఎంబీకి నమూనాలు పంపగా.. ఆ పరీక్షలో ఒమిక్రాన్‌గా గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. కోవిడ్ లక్షణాలు లేకపోవడంతో అధికారులు.. నిన్న తిరిగి టెస్ట్ చేయించగా రెండోసారి టెస్ట్‌లో నెగెటివ్‌గా నిర్దారణ అయినట్లు పేర్కొంది. ఏపీకి వచ్చిన 15 మంది విదేశీ ప్రయాణికుల నమూనాల సేకరించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
