నెల్లూరు నగరంలో ఫ్లెక్సీ వార్

నెల్లూరు నగరంలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం వివాదానికి దారితీసింది. దీనిపై అధికార, ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి జయంతి నేపథ్యంలో నెల్లూరు నగరంలోని కొన్ని చోట్ల ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అభిమానులు. అయితే, కార్యక్రమం పూర్తికాకముందే మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలను తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఫ్లెక్సీలను తొలగించడంపై ఆనం వివేకా తనయుడు రంగమయూర్ మండిపడ్డారు. క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో జైలుకెళ్లొచ్చిన వారి ఫ్లెక్సీలతో రోడ్లను నింపేస్తున్నా పట్టించుకోని అధికారులు.. జయంతి కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను తొలగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో రాజకీయ మార్పు తథ్యమంటూ ఆయన హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com