ఆ రాష్ట్రానికి తుఫాను హెచ్చరికలు..

ఆ రాష్ట్రానికి తుఫాను హెచ్చరికలు..
బంగాళఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం తుపాన్‌గా మారి ఉత్తరాంధ్రను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బంగాళఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం తుపాన్‌గా మారి ఉత్తరాంధ్రను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఏపీ వాతావరణశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. శుక్రవారం సాయంత్రం పూరీకి 590 కిలోమీటర్లు, తూర్పు ఆగ్నేయంగా కళింగపట్నానికి 740 కిలోమీటర్లు తూర్పుగా కేంద్రీకృతమై ఉంది. ఇవాళ తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా... ఆదివారం తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది..

ఆ తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి, దక్షిణ ఒడిశాలోని గోపాల్‌పూర్‌, ఉత్తర కోస్తాలో విశాఖపట్నం మధ్య కళింగపట్నానికి సమీపాన తీరం దాటునున్నట్లు వాతావారణశాఖ తెలిపింది. ఈ నెల 26న తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా అతి భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story