AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఉగాది తర్వాత ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 నుంచి 9.45 మధ్య కొత్త జిల్లాల్లో అందుకు సంబంధించిన కార్యకలాపాల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల విభజన సహా అన్నింటిపైనా ఇవాళ సీఎం జగన్ సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి.. CS సమీర్ శర్మ, DGP రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల, ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్, CCLA, లా, ట్రాన్స్‌పోర్ట్, IT శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు హా వివిధ అంశాల వారీగా ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని పరిశీలించిన నేపథ్యంలో.. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేదానిపై చర్చించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com