YS Jagan : జగన్ వల్ల చిక్కుల్లో ఐసీపీ, ఐఏస్ అధికారులు..!

మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అరాచక పాలన వల్ల సామాన్య ప్రజలే కాదు.. ఏకంగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు సైతం చిక్కుల్లో పడుతున్నారు. జగన్ తన అధికార ఒత్తిడితో ఎంతో మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను తన అక్రమాలలో భాగం చేశారు. దాని వల్ల వారంతా ఇప్పుడు సస్పెన్షన్ అవుతున్నారు. ఇంకొందరు అయితే జైలుకు కూడా వెళ్తున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. ఆయన్ను రిటైర్ అయ్యేదాకా సస్పెన్షన్ లోనే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో ఐజీ సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయడానికి పాట్నా వెళ్లారు ఏపీ పోలీసులు. నేడు ఆయన్ను ఏపీకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. వీరే కాదు జగన్ ఒత్తిడికి తలొగ్గిన అనేక మంది ఇప్పుడు బాధితులుగా మారారు. 2014-19 మధ్య ఇంటెలిజెన్స్ చీప్ గా ఉన్న ఏబీ వెంకటేశ్ గారు జగన్ కోడి కత్తిలో, వివేకా హత్య కేసులో నిజానిజాలను పసిగట్టారని చెప్పి.. ఆయన్ను రిటైర్ అయ్యేదాకా సస్పెన్షన్ చేసింది వైసీపీ ప్రభుత్వం.
ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ఒత్తిడి చేయొద్దు అని నీతులు చెప్పిన జగన్.. తన హయాంలో మాత్రం అనేక మందిని తన అక్రమాలలో ఒత్తిడి చేసి భాగం చేశాడు. ఆ దెబ్బకు ఎంతో మంది ఇప్పుడు శిక్షలకు గురవుతున్నారు. జగన్ వల్ల ప్రవీణ్ ప్రకాశ్, శ్రీలక్ష్మీ, సిద్ధాంత్ కౌశల్ వీఆర్ ఎస్ తీసుకున్నారు. పల్లె జాషువా, ఆంజనేయులు, కాంతిరానా, విశాల్ మున్నీ, సంజయ్ లాంటి వారు సస్పెన్షన్ కు గురయ్యారు. ఇక చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన కొల్లి రఘురామరెడ్డి చర్యలకు గురయ్యారు.
ఇలా ఎంతో మంది జగన్ దుశ్చర్యలకు బలైపోతున్నారు. ఎంతో కష్టపడి చదువుకుని సీనియార్టిటీ సంపాదించుకుని.. మంచి ప్రమోషన్లు పొందే సమయంలో జగన్ వలలో చిక్కుకుని ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు. ఇప్పుడు ఏపీలో చాలా మంది అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీరంతా జగన్ మాయలో పడి తమ ఉద్యోగాలకే ఇబ్బందులు తెచ్చుకోవద్దని కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు.
Tags
- Y. S. Jagan Mohan Reddy
- Raghu Rama Krishna Raju
- N. Chandrababu Naidu
- Andhra Pradesh Politics
- YSRCP Government
- IPS Officers Suspension
- IAS Officers VRS
- CID Sunil Kumar
- IG Sunil Naik
- AB Venkateswara Rao
- Custodial Torture Case
- Viveka Murder Case
- Administrative Pressure
- Political Controversy
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
