APలో BJPని బలోపేతం చేస్తాం: మాజీ CM కిరణ్‌ కుమార్ రెడ్డి

APలో BJPని బలోపేతం చేస్తాం: మాజీ CM కిరణ్‌ కుమార్ రెడ్డి
APలో పార్టీ బలోపేతంపై మాజీ CM కిరణ్‌ కుమార్ రెడ్డితో చర్చించామని AP BJP రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు

APలో పార్టీ బలోపేతంపై మాజీ CM కిరణ్‌ కుమార్ రెడ్డితో చర్చించామని AP BJP రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కిరణ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో దాదాపు నాలుగు గంటలపాటు సోము వీర్రాజు , RSS నేత మధుకర్‌లు కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు , ప్రధాని మోడీ తొమ్మిదేళ్ళ పాలన ,APలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు సోమువీర్రాజు తెలిపారు. ప్రస్తుతం AP ప్రభుత్వ పాలనపై స్పందించే సమయం కాదని మరో మారు అన్ని విషయాలు చర్చించుకుని మాట్లాడతానని BJP నేత మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో BJP బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తామన్నారు. BJP అధిష్ఠానం అదేశిస్తే అటు తెలంగాణ, ఇటు APలో యాక్టివ్ గా పనిచేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు .

Tags

Read MoreRead Less
Next Story