మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
మచిలీపట్నం చింతగుంటపాలెంలో మున్సిపల్ అధికారులు.. ఆక్రమణల తొలగింపు పేరుతో టీడీపీ సానుభూతిపరుల షాపుల తొలగిస్తున్నారు.

మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నం చింతగుంటపాలెంలో మున్సిపల్ అధికారులు.. ఆక్రమణల తొలగింపు పేరుతో టీడీపీ సానుభూతిపరుల షాపుల తొలగిస్తున్నారు. దీంతో బాధితుల పక్షాన ఘటనాస్థలంలో కొల్లు రవీంద్ర బైఠాయించారు. న్యాయంగా ఆక్రమణలు తొలగించాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ఆక్రమణల పేరుతో టీడీపీ కార్యకర్తల షాపులు తొలగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది.

Tags

Next Story