Mudragada Padmanabham Name Changed : అఫీషియల్.. ముద్రగడ పద్మనాభం పేరు మారింది

మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham ) పేరు మారింది. తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ( Mudragada Padmanabha Reddy ) మారుస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రచార సమయంలో సవాల్ విసిరారు. అయితే.. ఎన్నికల్లో పవన్ నెగ్గడం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ తన సవాల్‌కు కట్టుబడి ఉంటానని ప్రకటించడమూ తెలిసిందే. తాజాగా.. ఆయన పేరు మారింది. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఈ మేరకు గెజిట్ విడుదలైంది.
తాజా పరిణామంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్ ఆయన కొత్త పేరు పద్మనాభ రెడ్డిని అధికారికంగా గుర్తించింది. ముద్రగడ గతంలో జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినప్పటికీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (వైసీపీ) చేరారు. చర్చలు జరిగినా, పవన్ కళ్యాణ్ తన ఇంటికి రాకపోవడంతో ముద్రగడ పిఠాపురంలో పవన్‌పై ( Pawan Kalyan ) తీవ్ర స్థాయిలో వ్యతిరేక ప్రచారం చేస్తూ, ఆయనపై విమర్శలు చేస్తూ, ఆ ప్రాంతానికి ఆయనకు ఉన్న సంబంధాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముద్రగడపై తీవ్ర ట్రోలింగ్ జరిగింది. అయితే తన మాట నిలబెట్టుకుని అధికారికంగా పేరు మార్చుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com