మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్ ..!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు పోలీసులు మరోసారి షాకిచ్చారు. ఆదివారం రాత్రి ప్రభాకర్‌ను అరెస్ట్ చేశారు. వివాహ కార్యక్రమానికి హాజరైన వస్తున్న ఆయన్ను విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం దగ్గర అదుపులోకి తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయిన చింతమనేని.. మరోసారి జైలుపాలయ్యారు.
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా శనివారం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ధర్నా చేశారు. ఎడ్లబండితో తన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, దెందులూరు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్తుండగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డగించారు. పోలీసుల తీరుపై చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో చింతమనేనికి, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చివరకు అధికారులకు చింతమనేని ప్రభాకర్ వినతి పత్రం అందజేశారు.
టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పెళ్లికి హాజరై వస్తున్న చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చింతమనేని అరెస్ట్ పై మండిపడ్డారు టీడీపీ నేతలు. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే చింతమనేని విడుదల చేయాలని డిమాండ్ ్చేసారు. ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందంటూ మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com