Veligonda : వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు విడుదల

కరవు ప్రాంతాలకు కృష్ణా వరద జలాలను మళ్లించే కీలక ప్రాజెక్టు వెలిగొండ ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా వెలిగొండ టన్నెళ్ల నుంచి నల్లమలసాగర్ జలాశయానికి నీళ్లు తీసుకువెళ్లేందుకు YS హయాంలో 105 కోట్లు వెచ్చించి తవ్విన ఫీడర్ కాలువ మాత్రం శిథిలమైంది. నిర్మాణ, డిజైన్ లోపాలతో పాటు ఇన్నాళ్ల వర్షాలకు, ఆ కాలువలో నీళ్లు చేరి కొన్నిచోట్ల ఆనవాళ్లు కోల్పోయింది. దీంతో కాలువను తీర్చిదిద్దేందుకు, అవసరమైన చోట్ల రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు, లైనింగ్ పనులకు కూటమి ప్రభుత్వం 456 కోట్లతో శుక్రవారం పాలనామోద ఉత్తర్వులు ఇచ్చింది. వెలిగొండ టన్నెళ్ల నుంచి దాదాపు 21.8 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఇందులో 1,500 క్యూసెక్కులు మళ్లించాల్సి ఉంది. కాలువ వెడల్పు 23 మీటర్లు. ఆ సమీప పొలాల్లో ఉన్న నాసిరకం మట్టిని తీసుకువచ్చి కాలువ నిర్మించారని స్థానికులు చెబుతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com