Pulasa Fish : గోదావరికి ఎర్రనీరు.. పులసకు రూ.24,000
ఈ సీజన్లో గోదావరికి వరద ప్రారంభం కావడంతో పులస చేపల సందడి మొదలైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మం. రామరాజులంక వద్ద ఉన్న వశిష్ఠ గోదావరిలో కేజిన్నర బరువున్న పులస చేప చిక్కింది. దీన్ని ఓ వ్యక్తి రూ.24వేలకు కొనుగోలు చేశారు. ఏడాదిలో తక్కువ కాలం లభ్యం కావడం, రుచి అమోఘంగా ఉండటంతో పులస చేపలకు డిమాండ్ ఎక్కువ.
చేప ఇలా చిక్కిందో లేదో.. దాన్ని కొనుగోలు చేసేందుకు అందరూ పోటీపడ్డారు. అయితే, చివరకు అప్పన రాముని లంకకి చెందిన మాజీ సర్పంచ్ బర్రె శ్రీను రూ. 24 వేలకు ఈ కేజీన్నర చెప్పాను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
పదిరోజులుగా గోదావరిలో నీరు రంగు మారడంతో మత్స్యకారులు వలలకు పనిచెప్పారు. ఈ సీజన్‌లో మొట్టమొదటి పులసను చూసి ఆనందంతో పొంగిపోయారు. ఎందుకంటే పులసకు ఉండే డిమాండ్ అలాంటిది మరి. వలలో పులస పడిందంటే మత్స్కకారుల పంట పండినట్టే. అనుకున్నట్టుగానే ఆ పులస భారీ ధరకే అమ్ముడుపోయింది. కేజీన్నర బరువున్న ఆ పులసను అప్పనరామునిలంకకు చెందిన మాజీ సర్పంచ్ బర్రె శ్రీను రూ.24,000లకు కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో మొదటి పులసను దక్కించుకున్న శ్రీను పులసకూరను బంధువులందరితో షేర్ చేసుకుంటున్నారు. అమోఘమైన రుచితో పాటు.. ఏడాదిలో చాలా తక్కువకాలం మాత్రమే లభ్యం కావడం కూడా వాటి ధర అధికంగా ఉండటానికి ఒక కారణం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com