ఏపీ తలరాత మార్చే గూగుల్ డేటా సెంటర్.. సుందర్ పిచాయ్ మాటల్లోనే..

ఇది కూటమి సాధించిన విజయం. తెలుగు గడ్డకు దక్కిన గౌరవం ఇది. అదే విశాఖ తీరాలలో గూగుల్ డేటా సెంటర్ కల సాకారమైన వేళ. ప్రపంచ అద్భుతాలలో ఇది కూడా ఒకటి కాబోతోంది. ఈ గూగుల్ డేటా సెంటర్ రావడంతో ఏపీ తలరాత మారబోతోంది. ఇది మేం చెబుతున్న మాట కాదు. ఏకంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, సేల్స్ ఫోర్స్ సీఈవో మార్క్ తో కలిసి ఓ కీలక కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఎన్నో టెక్ విప్లవాలకు వేదికైనా థియేటర్ లోనే వీరిద్దరూ నిన్న కాన్ఫరెన్స్ నిర్వహించి అందులో ప్రత్యేకంగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడారు. అదే ఇప్పుడు యావత్ టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది.
సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు విశాఖను చూసేవాడిని. అది చాలా అందమైన ప్రాంతం. ఇప్పుడు మేం అమెరికా వెలుపల అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ను విశాఖలోనే పెడుతున్నాం. 15 బిలయన్ డార్లు, 1 గిగా వాట్ ప్లస్ డేటా సెంటర్, 80 శాతం గ్రీన్ ఎనర్జీ, సముద్ర గర్భ కేబుల్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. ఆ పెట్టుబడులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా మార్చేస్తాయి అని ప్రకటించారు సుందర్ పిచాయ్. ప్రపంచ టెక్ రంగంలో ఏఐ, ఆపిల్ లాంటివి ఈ థియేటర్ నుంచే ప్రపంచానికి పరిచయం అయ్యాయి. ఇప్పుడు అదే వేదిక మీద నుంచి సుందర్ పిచాయ్ గూగుల్ డేటా సెంటర్, విశాఖ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
అంటే గూగుల్ డేటా సెంటర్ ప్రత్యేకత ఏంటనేది ఆయన మాటల్లోనే తెలిసిపోతోంది. కానీ ఇక్కడున్న వైసీపీ బ్యాచ్ మాత్రం అసలు డేటా సెంటర్ తో ఏం లాభం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు టెక్నాలజీ గురించే పెద్దగా తెలియని వైసీపీ బ్యాచ్.. కల్తీమద్యం తయారు చేయడం తప్ప డేటాను తయారు చేయడం గురించి తెలియని జగన్ అనుచరులు అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడుతారు. సీఎం చంద్రబాబు, లోకేష్ ఏ విజన్ తో ఈ డేటా సెంటర్ ని ఏపీకి తీసుకొచ్చారో భవిష్యత్ మాట్లాడుతుంది. చెట్టు పెట్టిన వెంటనే ఫలాలు రావు కదా.. దానికి ఇంకొంచెం టైమ్ పడుతుంది. కానీ కచ్చితంగా విశాఖ రూపు, రేఖలు మారిపోతాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com