AP News: ప్రభుత్వాస్పత్రులలో తప్పని వెతలు

AP News:  ప్రభుత్వాస్పత్రులలో తప్పని వెతలు
క్షేత్ర స్థాయిలో రోగులకు అందని వైద్య సేవలు

వైద్యరంగానికి తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి ప్రకటనలు క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉన్నాయి. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు నామమాత్రంగా ఉన్నాయి.

మెరుగైన వైద్యం పేరుతో మచిలీపట్నం ఆసుపత్రి నుంచి రోగులను ఎక్కువగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పంపిస్తున్నారు.ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు . ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు. కానీ ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి పేదలకు వైద్య సేవలందించటంలో వెనుకంజలో ఉంది. ప్రస్తుతం మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో 450 పడకలు ఉన్నాయి. వివిధ విభాగాల్లో 92 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే 120 మంది స్టాప్ నర్సులు పని చేస్తున్నారు. ఇంతమంది విధులు నిర్వహిస్తున్నా కూడా చిన్న చిన్న ఆరోగ్యసమస్యలకు ఇతర ఆసుపత్రులకు రోగులను పంపిస్తున్నారు. SPOT.....

కృష్ణాజిల్లా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి రోగులు ఎక్కువగా ఈ ఆసుపత్రికి వస్తుంటారు. ఆసుపత్రిలో వైద్య సౌకర్యాల కొరత ఉందని రోగులు చెబుతున్నారు. ఆసుపత్రిలో న్యూరాలజీ విభాగం కేవలం O.P.లకే పరిమితమైంది. ఈ దృశ్యాల్లో మీరు చూస్తున్న వ్యక్తి కైకలూరుకు చెందిన బాజీ...ఆరోగ్యం బాలేకపోవటంతో స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళితే వారు మచిలీపట్నం వెళ్లమన్నారు. ఇక్కడి వైద్యులు వారం రోజులు చికిత్స అందించిన తర్వాత విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేశారంటూ రోగి వాపోయారు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story