Srisailam Temple : శ్రీశైలం ఆలయ తొక్కిసలాట వెనుక కుట్ర..?

Srisailam Temple  : శ్రీశైలం ఆలయ తొక్కిసలాట వెనుక కుట్ర..?
X

ఏపీలో సంచలనం రేపిన శ్రీశైలం ఆలయ తొక్కిసలాట వెనక కుట్ర ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అన్ని ఆలయాల్లో సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. విఐపిల కంటే సామాన్యుల దర్శనాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. గత వైసిపి పాలనలో కేవలం విఐపిలకు మాత్రమే పెద్దపీట వేస్తూ సామాన్యులను గాలికి వదిలేసారు. కానీ కూటమి అలా కాకుండా సామాన్యులకే పెద్ద పీట వేయాలంటూ పదేపదే అధికారులకు చెబుతున్నా సరే వారి తీరు అస్సలు మారట్లేదు అని మరోసారి శ్రీశైలం ఘటనతో నిరూపితం అయింది. శ్రీశైలం మల్లన్న ఆలయంలో శివ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా అధికారులు కేవలం విఐపి, వివిఐపిల దర్శనాల పనుల్లోనే మునిగితేలారు. సామాన్య భక్తుల ఇబ్బందులను కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు అని ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది.

అందుకే ఈ ఘటన మీద సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర ప్రభుత్వ వర్గాలు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎంవో ఆధ్వర్యంలో సీక్రెట్ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సంబంధిత అధికారులపై బదిలీ వేటు కూడా పడింది. అయితే బాధ్యులను సస్పెండ్ చేస్తారా లేదంటే కంటిన్యూ చేసి తగిన చర్యలు తీసుకుంటారనేది ఇంకా తెలియ రాలేదు. కానీ అధికారులు మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ప్రభుత్వ వర్గాలు పదేపదే ఫైర్ అవుతూనే ఉన్నాయి. అధికారుల మీటింగ్ లో ప్రతిసారి సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా చెబుతూనే ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు పదేపదే ఆదేశిస్తూనే ఉన్నారు.

కానీ అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ నేతలతో అధికారులకు లింకులు ఉన్నాయని ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే ఉన్నాయి. వైసిపి నేతల మెప్పు కోసం అధికారులు చేస్తున్న దురాగతాలను.. కూటమి ప్రభుత్వానికి మచ్చ తీసుకువచ్చేలా అధికారుల పనితీరును ఎట్టి పరిస్థితుల్లో సహించకుండా ఇప్పుడు శ్రీశైలం ఘర్షణ వెనుక ఉన్న కుట్రలను వెలికి తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఆలయాల్లో సామాన్య భక్తులకే పెద్ద పీట వేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసు కోవాలని సీఎం చంద్రబాబు నాయుడు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

Tags

Next Story