Harirama Jogayya: దోచుకోవడం, దాచుకోవడం మీకు అలవాటే కదా..

Harirama Jogayya: దోచుకోవడం, దాచుకోవడం మీకు అలవాటే కదా..
జగన్ విమర్శల్ని విన్నాక సినిమాల్లో విలన్‌లా అన్పిస్తోందన్న హరిరామ జోగయ్య

సీఎం జగన్‌కు కాపు నేత హరిరామ జోగయ్య ఘాటు లేఖ రాశారు. పవన్‌ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ ఫైరయ్యారు.జగన్ విమర్శల్ని విన్నాక సినిమాల్లో విలన్‌లా అన్పిస్తోందన్న హరిరామ జోగయ్య వైఎస్‌ హుందాతనంలో జగన్‌కు 10 శాతం కూడా లేదన్నారు. చట్టపరంగా పవన్ కళ్యాణ్‌ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ప్రజలకు లేని అభ్యంతరం మీకెందుకంటూ జగన్‌ను ప్రశ్నించారు.

పవన్‌పై బురద చల్లడానికి వేరే కారణాలు లేక చవకబారు విమర్శలతో లబ్ధి పొందాలనుకుంటున్నారని విమర్శించారు. మరోసారి చవకబారు విమర్శలు చేయకుండా నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదని హరిరామ జోగయ్య హెచ్చరించారు. మీ తాత రాజారెడ్డి దగ్గర నుంచి మీ కుటుంబంలో దోచుకోవడం, దాచుకోవడం అలవాటే కదా అంటూ ఆరోపించిన హరిరామ, కాదని చెప్పగల దమ్ముందా మీకు అని సవాల్‌ విసిరారు. మరోసారి మీ అవినీతి చిట్టా ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా అన్నారు.పవన్‌ను ఒకటి అని నాలుగు అన్పించుకోవడం ఏ సలహాదారు నేర్పారన్న హరిరామజోగయ్య ఇలాంటి తప్పుడు కూతలు మిమ్మల్ని ముంచడానికే అన్పిస్తోందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story