Anantapur: రెడ్ అలర్ట్.. అనంతపురం జిల్లాను ముంచెత్తుతున్న వరద..

Anantapur: కర్ణాటకలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు.. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. అటు పెన్నా, జై మంగళనది, చిత్రావతి నదులకు వరద పోటెత్తుతోంది. జోరువానలతో నదులు ఉగ్రరూపం దాల్చటంతో.. పరివాహాక ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లోని పల్లెలకు రాకపోకలు నిలిపి వేశారు. అటు ఉమ్మడి అనంతపురం జిల్లాను వరద ముంచెత్తుతోంది. వరద ఎఫెక్ట్‌తో హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు. మడకశిర ప్రాంతాలకు రాకపోకలను నిలిపివేశారు. కోడికొండ వద్ద జాతీయ రహదారి నుంచి వాహనాలను దారి మళ్లించారు.
మరోవైపు సత్యసాయి జిల్లా హిందూపురం పరిసరాల్లో రాత్రి కురిసిన జోరువానలకు పరసరాల్లో భారీగా వరద నీరు చేరింది. నివాసప్రాంతాల్లో మోకాలులోతు నీరు నిలిచింది. హిందుపురంలో ఓ ఇంటి మిద్దె కూలటంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. పలు కాలనీల్లోకి భారీగా నీటిచేరికతో ముంపుబాధితులు... పునరావాస కేంద్రాలతు తరలివెళ్లాలని స్థానికులు ఆదేశించారు. మరో రెండు, మూడురోడులు భారీ వర్షాలకు కురిసే ఛాన్స్ ఉండటంతో ప్రజలందరూ అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com