Heavy Rainfall : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఐదురోజుల పాటు వర్షాలు

Heavy Rainfall : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఐదురోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు మరో భారీ వానగండం పొంచి ఉంది. గురువారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో రాగల ఐదురోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అల్పపీడనం నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్టు జారీ చేసింది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

రానున్న అయిదు రోజులపాటు తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలోభారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. యానం, ఉత్తరాంధ్ర పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం సముద్రమట్టానికి సగటున 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని, ఎత్తుకువెళ్లే కొలది నైరుతి దిశలో వంగి ఉందని పేర్కొంది. గురువారం భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడుతాయని చెప్పింది. కాగా.. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో కొహెడలో 22.3, సముద్రాల గ్రామంలో 21 సెంటీమీటర్ల భారీ వర్షపాతం. రికార్డయ్యిందని టీజీడీపీఎస్ వివరించింది.

Tags

Next Story